: టీడీపీ నేత ఇంట పెళ్లి వేడుకలో కేసీఆర్!... టీడీ జనార్దన్ కుమార్తెకు ఆశీర్వాదం!

టీడీపీకి చెందిన ఏపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఇంట జరిగిన వివాహ వేడుకకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. టీడీ జనార్దన్ కుమార్తె గౌతమి సరోజ వివాహం నిన్న హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిశాంత్ చంద్రతో జరిగింది. ఈ వేడుకకు పలువురు టీడీపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీ జనార్దన్ నుంచి ఆహ్వానం అందుకున్న కేసీఆర్ కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

More Telugu News