: తిరుగుబాటుదార్ల కోసం జైళ్లు ఖాళీ చేయిస్తున్న టర్కీ ప్రభుత్వం!... పలువురు ఖైదీలకు విముక్తి!

తిరుగుబాటు దారులను జైళ్లలో పెట్టేందుకు ఇతరులను విడుదల చేయాలని టర్నీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం 38 వేల మంది ఖైదీలకు షరతులతో కూడిన విడుదల లభించనుంది. రెండేళ్లు, అంతకంటే తక్కువ శిక్ష పడి జైలుకు వెళ్లిన వారిని పెరోల్ పై విడుదల చేయాలని భావిస్తోంది. హత్య, గృహహింస, లైంగిక వేధింపులు, తీవ్రవాదం, దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేయడం వంటి నేరాల్లో శిక్ష పడ్డవారిని తప్ప, మిగిలిన వారిని విడుదల చేయనుంది. ఇందులో జూలై 1 తరువాత శిక్ష పడ్డవారు కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 38 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజడాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టర్కీ సైన్యంలోని ఒక వర్గం జూలై 15న ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పిలుపుతో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సైన్యాన్ని నిర్బంధించి తిరుగుబాటును తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఆరోపణలతో 35 వేల మందిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వం ప్రశ్నించగా, 17 వేల మంది తిరుగుబాటులో పాలు పంచుకున్నట్టు నిర్ధారించి అరెస్టు చేసినట్టు టర్కీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ తిరుగుబాటులో సైనికులు, పోలీసులు, జడ్జిలు, జర్నలిస్టులు కూడా భాగం పంచుకోవడం విశేషం.

More Telugu News