: సాక్షి మాలిక్ పై సెహ్వాగ్ ట్వీట్ ఆలోచింపజేస్తోంది!

రియో ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత్ కు కాంస్యపతకం అందించిన సాక్షి మాలిక్ ను అభినందిస్తూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన ట్వీట్ దేశం మొత్తాన్ని అకట్టుకుంటోంది. 'ఆడ పిల్లలను పురిట్లోనే చంపకుండా ఉంటే ఏం జరుగుతుందో సాక్షి మాలిక్ గుర్తు చేసింది. క్రీడల్లో మనదేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మన బాలికలు వెళ్లి, మనదేశ గౌరవం కాపాడార'ని సెహ్వాగ్ ట్విట్ చేశాడు. రియోలో పతకం సాధించడంతో సాక్షి మాలిక్ గురించి దేశం మొత్తం మాట్లాడుతోందని, బాలికలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం శోచనీయమని ట్విట్టర్ లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇది అందర్నీ ఆకట్టుకుంటోంది. సెహ్వాగ్ పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరూ సెహ్వాగ్ తో ఏకీభవిస్తున్నారు. కాగా, సాక్షి మాలిక్ సొంత రాష్ట్రమైన హర్యానాలో భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హర్యానాలో ప్రతి 1000 మంది బాలురకు 873 మంది బాలికలు మాత్రమే ఉండడం భ్రూణహత్యల తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని సెహ్వాగ్ చేసిన విజ్ఞప్తి అందర్నీ ఆకట్టుకుంటోంది.

More Telugu News