: కబడ్డీలో యాదవుల జట్టుపై దళితుల జట్టు గెలిచిందని దాడి!

ఉత్తర భారతంలో దళితులపై దాడులు ఆగడం లేదు. కబడ్డీ పోటీల్లో యాదవుల జట్టుపై దళితుల జట్టు గెలిచిందన్న కారంణంతో వారిపై దాడికి దిగిన ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... గురుగావ్‌ జిల్లా చక్కార్‌ పూర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో కులాల మధ్య ఐక్యత పెంచేందుకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా నిర్వహించినట్టే ఈ ఏడు కూడా కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ గ్రామాలకు చెందిన యువకులు పాల్గొంటారు. ఇక్కడి పోటీల్లో దళితులు, యాదవులు, జాట్లు, గుజ్జర్లు, బనియాలు, అగర్వాళ్ల జట్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీల్లో దళితుల జట్టు యాదవుల జట్టుపై విజయం సాధించింది. అంతే, యాదవుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో దళితులపై యాదవులు దాడికి దిగారు. దీంతో ఒక వ్యక్తి కాలు విరిగిపోగా, మరొక వ్యక్తి తలపై గాయాలయ్యాయి. ఇరు జట్లకు చెందిన పది మంది క్రీడాకారులకు గాయాలయ్యాయి. వీరంతా గురుగావ్ లోని ఉమాసంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై స్థానిక కౌన్సిలర్ మాట్లాడుతూ, జిల్లాలో కులపరమైన క్రీడాపోటీలు జరగడం లేదని, ఒకే కులం వారు ఒక జట్టు నిండా ఉన్నా అది యాదృచ్ఛికమే కానీ, కులాలవారీగా జట్లు లేవని అన్నారు. ఇప్పటికే దళితులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరింత కుల వివక్షను పెంచుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News