: పూర్తిగా నిండని శ్రీశైలం జలాశయం!... 874 అడుగుల నుంచి కిందకొస్తున్న నీటి మట్టం!

శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారలేదు. ఎగువ రాష్ట్రాల్లో వెల్లువెత్తిన భారీ వరదల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తింది. 2 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు చేరుతున్న నేపథ్యంలో జలాశయం పూర్తిగా నిండిపోతుందన్న భావన వ్యక్తమైంది. అయితే 874 అడుగులను దాటి జలాశయంలో నీరు చేరలేదు. శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేటి ఉదయం 8 గంటల సమయానికి జలాశయంలో 874.2 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. వెరసి జలాశయంలో ప్రస్తుతం 159.77 టీఎంసీల నీరు ఉంది. ఇదిలా ఉంటే... ఎగువ రాష్ట్రాల నుంచి నీటి రాక దాదాపుగా నిలిచిన నేపథ్యంలో ప్రస్తుతం జలాశయానికి 16 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. అదే సమయంలో జలాశయం నుంచి 43,200 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో 874.2 అడుగుల నుంచి జలాశయం నీటిమట్టం కిందకు పడిపోతోంది.

More Telugu News