: తెలంగాణను 27 జిల్లాలుగా విభజించాలట!... కేసీఆర్ కు చేరిన సబ్ కమిటీ నివేదిక!

కొత్త రాష్ట్రం తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లే ఉంది. ఈ అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ... సుదీర్ఘ అధ్యయనం తర్వాత తన నివేదికను నిన్న సీఎం కేసీఆర్ కు అందజేసింది. ఈ నివేదికను మరోమారు పరిశీలించి కేసీఆర్ ఓకే చేస్తే... కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయినట్లేనన్న వాదన వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను మొత్తం 27 జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ నివేదించింది. అదే సమయంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 44 నుంచి 74కు, మండలాల సంఖ్యను 459 నుంచి 533కు పెంచాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ అందజేసిన నివేదికపై నిన్ననే కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ నివేదికను అఖిలపక్షంలో పెట్టి చర్చించాలని కూడా కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం.

More Telugu News