: ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల మ‌ధ్య జ‌ల వివాదాలున్నాయి: క‌ర్ణాట‌క

రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డిన జ‌లవివాదాల అంశంలో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యున‌ల్ ముందు క‌ర్ణాట‌క రాష్ట్ర వాద‌న‌లు ముగిశాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల మ‌ధ్య జ‌ల వివాదాలున్నాయని క‌ర్ణాట‌క త‌ర‌ఫు అధికారులు తెలిపారు. సెక్ష‌న్ 89 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కే ప‌రిమితమ‌ని పేర్కొన్నారు. అయితే సెక్ష‌న్ 89లో పలు అంశాలు సమగ్రంగా లేవని చెప్పింది. నాలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాలు జ‌ర‌పాలంటే సెక్ష‌న్ 89లో స్ప‌ష్ట‌త కావాల‌ని విన్న‌వించుకుంది. గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లుప‌రుస్తూ దాని ఆధారంగానే అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చే వాటాను ప్ర‌స్తుతం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు పంచుకోవాల‌ని కర్ణాటక బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యున‌ల్‌కు త‌మ వాద‌న వినిపించింది. క‌ర్ణాట‌క, మ‌హారాష్ట్ర మ‌ధ్య నీటి పంప‌కాల‌లో ఎటువంటి ఘ‌ర్ష‌ణలు లేవ‌ని తెలిపింది.

More Telugu News