: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు... డీఎంకే సభ్యుల సస్పెన్షన్

తమిళనాడు అసెంబ్లీలో నేడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను గుర్తుకు తెచ్చేలా పాలిస్తున్నారని, డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తూ అసెంబ్లీలో ఆందోళన చేబట్టారు. దీంతో అసెంబ్లీ స్పీకర్‌ పి.ధనపాల్‌ డీఎంకేకి చెందిన 89 మంది ఎమ్మెల్యేలను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ కీలక నేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలనందరినీ బయటకు పంపేశారు. స్టాలిన్ మొండికేయడంతో అతనిని సిబ్బంది ఎత్తుకుని సభామందిరం బయటకు తీసుకెళ్లారు. దీనిపై డీఎంకే అధికార ప్రతినిధి మనురాజ్ సుందర్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ గౌరవం చూపాలని సూచించారు. తాము కూడా ప్రజలెన్నుకున్న నేతలమేనని ఆయన తెలిపారు.

More Telugu News