: 14 ఏళ్ల జైలు శిక్ష అనంతరం వరంగల్ జైలు నుంచి పాక్ ఖైదీ విడుదల... పాక్ పట్టించుకోకపోవడంతో వెంటనే మళ్లీ జైలుకు

2004లో భారత సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తూ పట్టుబడి 14 ఏళ్ల శిక్షకు గురైన గూఢచారి మహ్మద్ అర్షద్ మహమూద్, శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కాగా, పాక్ ప్రభుత్వం స్పందించకపోవడంతో, వెంటనే అదే జైలుకు తరలించారు. పాక్ లోని రహమయారన్ జిల్లాలోని ఖన్ పూర్ కు చెందిన అర్షద్ 2004లో అబీడ్స్ పోలీసులకు పట్టుబడగా, కేసును విచారించిన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 14 ఏళ్ల శిక్షను విధిస్తూ, 2009 ఏప్రిల్ 30న తీర్పిచ్చారు. తొలుత చర్లపల్లి జైలుకు, ఆపై విశాఖ జైలుకు, రాష్ట్ర విభజన తరువాత వరంగల్ జైలుకు అర్షద్ ను తిప్పారు. నిబంధనల ప్రకారం, మంగళవారంతో శిక్షా కాలం పూర్తయింది. ఇదే విషయాన్ని పాక్ హైకమిషన్ కి తెలిపినా, వారి నుంచి స్పందన రాలేదు. దీంతో లీగల్ అఫైర్స్ విభాగం స్పెషల్ జీవోను జారీ చేసి అర్షద్ ను వరంగల్ జైలులోనే ఉంచాలని కోరింది.

More Telugu News