: మహానది జలవివాదంపై ఒడిషాలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం

ఒడిషాలో మహానది జలవివాదం మరింత రాజుకుంది. ఆందోళ‌న‌ల‌తో అక్క‌డి ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఒడిషా నుంచి చత్తీస్‌గఢ్‌కు నీటిని తరలించడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకిస్తోంది. దీనికి నిర‌స‌న‌గా 12 గంటల పాటు ఒడిషా రాష్ట్ర‌ బంద్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్భంగా భువనేశ్వర్‌లో యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగారు. ఆ రాష్ట్ర‌ సచివాలయ ముట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలకు మ‌ధ్య వాగ్వివాదం జ‌రిగింది. దీంతో అక్క‌డ ఉద్రిక్తత చెల‌రేగింది. కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు అక్క‌డి రోడ్డుపైనే బైఠాయించి నిర‌స‌న తెలిపారు.

More Telugu News