: రూ. 251 ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్ బాగా పనిచేస్తోందని రివ్యూలు!

రింగింగ్ బెల్స్ సంస్థ మార్కెట్లోకి తీసుకు వచ్చిన ప్రపంచపు అతి తక్కువ ధర స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడమ్ 251'కు మంచి సమీక్షలు వస్తున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 70 వేల యూనిట్లను సంస్థ డెలివరీ చేయగా, వీటిని అందుకుని వాడుతున్న వారు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే, ఒకటిన్నర రోజు పాటు ఫోన్ పనిచేస్తోందని తెలుస్తోంది. బ్లూటూత్, వైఫై వంటివి బాగానే ఉన్నాయని, అంతర్గతంగా 8 జీబీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడంతో మరిన్ని ఫోటోలు దాచుకోవచ్చని వీటిని వాడుతున్న వారు అంటున్నారు. ఫోన్ కు దగ్గర్లో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్స్ ఉంటే వాటిని కనుక్కునే ప్రాగ్జిమిటీ సెన్సర్ దీనికి అదనపు ఆకర్షణ కాగా, అన్ లాక్ కోసం పవర్ బటన్ నొక్కాల్సిన అవసరం లేకుండా స్క్రీన్ మీద వేలు పెడితే చాలు. బ్రౌజింగ్, వాట్సాప్ కాలింగ్ చక్కగా పనిచేస్తున్నాయని, ఫోన్ వేడెక్కడం లేదని కస్టమర్లు చెబుతున్నారు. కెమెరాల విషయంలో అసంతృప్తి ఉన్నప్పటికీ రూ. 251తో ఇంత మాత్రం ఫోన్ రావడమే గొప్పని అంటుండటం గమనార్హం.

More Telugu News