: రాయలసీమను మార్చి చూపడమే నా ముందున్న ఏకైక లక్ష్యం: చంద్రబాబు

ముఠా తగాదాలు, ఫ్యాక్షన్ కక్షలకు నిలయమై ఉన్న రాయలసీమకు గత వైభవాన్ని తెచ్చి రతనాల సీమగా తయారు చేసి చూపడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. అనంతపురంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పతాకావిష్కరణ అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించి ప్రసంగించారు. రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నిధుల లేమి పట్టి పీడిస్తోందని, అయినా, ఈ రెండేళ్లలో ఎంతో అభివృద్ధిని సాధించి చూపామని తెలిపారు. రాయలసీమలోని ప్రతి ఎకరానికీ సాగునీరు అందించేందుకు నదుల అనుసంధానం పేరిట మహోజ్వల ప్రాజెక్టును చేపట్టామని, అందులో భాగంగా గోదావరి, కృష్ణా నదులను ఇప్పటికే కలిపామని గుర్తు చేశారు. ఓ పద్ధతి ప్రకారం, ప్రణాళికలను కార్యాచరణ దిశగా నడిపించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు అన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు నడిపిస్తున్నామని తెలిపారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలపాలన్నది తన లక్ష్యమని, లక్ష్య సాధనకు అధికారులు, ప్రజలు కలసికట్టుగా సహకరించాలని కోరారు. 2029కి ఇండియాలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు తయారు చేసినట్టు వివరించారు. అభివృద్ధితో పాటు ఆనందంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉండాలని అభిలషించారు.

More Telugu News