: ఆటుపోట్లను తట్టుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది... దానిని రక్షించుకోవాలి: రాష్ట్రపతి పిలుపు

ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. దేశంలో అల్లర్లు సృష్టించడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని విఛ్ఛిన్నకర శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, దేశ ప్రజంతా ఐక్యంగా ఉండాలని ఆయన సూచించారు. దేశ ప్రజలంతా మతసామరస్యాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటులో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ఆయన, ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. వారి త్యాగాలకు విలువ చేకూరే విధంగా దేశప్రజలు నడుచుకోవాలని ఆయన చెప్పారు.

More Telugu News