: న్యూయార్క్ లో ముస్లిం మతగురువుల కాల్చివేత

ముస్లిం మతోన్మాదుల నుంచి రక్షించుకునేందుకు క్రిస్టియన్ క్రూసేడ్ జరగాల్సి ఉందని అమెరికా మాజీ సైనికుడు వ్యాఖ్యానించిన 24 గంటల్లోపే న్యూయార్క్ లోని ముస్లిం మత గురువును కాల్చి చంపడం కలకలం రేపుతోంది. న్యూయార్క్ తూర్పు ప్రాంతమైన క్వీన్స్ లోని ఓజోన్ పార్క్ సమీపంలో గల అల్ పుర్ఖాన్ జమే మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇమాం మౌలామా అంకోజీ (55), అతని సహాయకుడు తరా ఉద్దీన్ (64) లను గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వారిపై జరిపిన కాల్పుల్లో తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అంకోజీ అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, తరా ఉద్దీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. దీనిపై అక్కడి ముస్లింలు తమకు న్యాయం జరగాలంటూ ఆందోళన చేపట్టారు. డొనాల్డ్ ట్రంప్ ముస్లిమోఫోబియా కారణంగా ఈ దారుణం చోటుచేసుకుందని, ఆయన చేస్తున్న మత విద్వేష వ్యాఖ్యలు ఇతరుల్లో అభద్రతా భావాన్ని పెంచుతున్నాయని, అందువల్లే ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.

More Telugu News