: అమెరికా అరుదైన ఫీట్... 1000 పైగా ఒలింపిక్స్ స్వర్ణాలతో ఎవరికీ అందనంత ఎత్తున!

ఒలింపిక్స్ చరిత్రలో అమెరికా ఎవరికీ అందనంత ఎత్తున సగర్వంగా నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రియోలో అడుగు పెట్టే వేళకు, ఇన్నాళ్లు వివిధ దేశాలలో జరిగిన ఒలింపిక్స్ లో మొత్తం 977 స్వర్ణాలను సొంతం చేసుకుని వున్న అమెరికా, ప్రస్తుత పోటీలు దాదాపు సగం ముగిసేసరికి తన మొత్తం స్వర్ణాల సంఖ్యను 1000కి పైగా పెంచుకుంది. మహిళా స్విమ్మర్లు కాథలీన్ బేకర్, లిల్లీ కింగ్, డాన్ వాల్మీర్, సిమోల్ మాన్యుల్ ల జట్టు 4x100 మీటర్ల మెడ్లే రిలే విభాగంలో స్వర్ణం సాధించడంతో అమెరికా వెయ్యి బంగారు పతకాల మైలురాయిని దాటింది. ఆపై పురుషుల 4X100 రిలేలోనూ మరో నాలుగు స్వర్ణాలు అమెరికా ఖాతాకు చేరాయి. కాగా, ఈ మొత్తం పతకాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 323 స్వర్ణాలు, ఈత కొలనులో 246 స్వర్ణాలు అమెరికాకు దక్కడం గమనార్హం. ఒలింపిక్స్ చరిత్రలో మరే దేశమూ అమెరికాకు దరిదాపుల్లో కూడా లేదు.

More Telugu News