: శుక్రుడిపై కూడా నివాస పరిస్థితులు ఉండేవా?

భూగ్రహం మినహా ఇతర ఏ గ్ర‌హాల్లోన‌యినా నివాస పరిస్థితులు ఉన్నాయా? అనే విష‌యాన్ని గురించి తెలుసుకునేందుకు శాస్త్ర‌వేత్తలు ఎన్నో ఏళ్లుగా త‌మ ప్ర‌య‌త్నాల్ని కొన‌సాగిస్తూనే ఉన్నారన్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ప‌రిశోధ‌కులు శుక్రుడిపై ఒకప్పుడు నివాస పరిస్థితులు ఉండ‌వ‌చ్చని చెబుతున్నారు. శుక్రుడిపై తొలినాళ్లలో 200 కోట్ల సంవత్సరాల వ‌ర‌కు నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉండేద‌ని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వివిధ గ్రహాల పూర్వ, భవిష్యత్ వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్న త‌మ‌కు ఈ అంశం గురించి తెలిసింద‌ని చెప్పారు. శుక్రుడిపై కార్బ‌న్ డయాక్సైడ్ కూడా అధిక‌మేన‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం భూమి కంటే అక్క‌డ‌ 90 రెట్లు అధికంగా ఈ వాయువు ఉంది. అయితే తేమ అస్సలు లేదు. శుక్రుడిలో ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీలకు చేరింద‌ట‌. భూమి త‌యార‌యిన విధంగా శుక్రగ్రహం కూడా ఒకే రకమైన పదార్థాలతో తయార‌య్యింద‌ని, 80వ దశకంలో తాము పయోనీర్ ద్వారా శుక్రుడిపై చేసిన పరిశోధనల ప్రకారం శుక్రుడిపై ఒకప్పుడు సముద్రం ఉండే అవకాశం ఉన్న‌ట్లు తెలిసిందని చెప్పారు. అయితే ఆ నీరంతా సూర్యుని ప్ర‌భావంతో ఎండిపోయి ఉంటుంద‌ని తెలిపారు.

More Telugu News