: అదుపులోకి తీసుకున్న ‘పుష్కర’ దొంగలందరూ 14 ఏళ్ల లోపు వారే!

విజయవాడలో రెండో రోజు కృష్ణా పుష్కరాలకు వస్తున్న యాత్రికుల తాకిడి బాగానే ఉంది. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, జేబు దొంగలకు తీరిక లేకుండా పోతోంది. ముఖ్యంగా పద్మావతి ఘాట్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆ ఘాట్ ను సందర్శించిన డీజీపీ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో, ఈ దొంగాలపై దృష్టి సారించిన పోలీసులు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 14 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. దీంతో, పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయడం మినహా మరేం చేయలేదు. అయితే, పుష్కరాలు జరిగే రోజుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించొద్దంటూ వారిని గట్టిగా హెచ్చరించి పోలీసులు వదిలేశారు.

More Telugu News