: ‘రియో’ స్విమ్మింగ్ పూల్ లో ఆకుపచ్చ నీరు

రియోలోని మారియా లెంక్ అక్వాటిక్స్ సెంటర్ లోని ఒక స్మివ్మిుంగ్ పూల్ ను మూసేశారు. దీనికి కారణం, స్మిమ్మింగ్ పూల్ లోని నీటి రంగు ఆకుపచ్చగా ఉండటమే. అయితే, ఇందులో నీళ్లు ఆకుపచ్చగా ఉండటాన్ని మొదట్లో పెద్దగా పట్టించుకోని ఒలింపిక్స్ అధికారులు ఆ తర్వాత దీనిని సీరియస్ గా తీసుకున్నారు. నీటిలో నాణ్యత లేకపోవడం వల్లే ఈవిధంగా జరుగుతోందని గ్రహించారు. నీటిని శుద్ధి చేయడానికి, స్విమ్మర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ నీటిలో కొన్ని రకాల రసాయనాలు కలపడం, పీహెచ్ స్థాయిలో సమతౌల్యం దెబ్బతినడం కారణంగానే వాటి రంగు మారిందని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News