: మన ఉద్యోగాలకు విదేశీయులు ఎసరు పెడుతున్నారు!: మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్‌

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తోన్న అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికాలో ఉద్యోగాలు త‌గ్గిపోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ.. విదేశీయులు త‌మ దేశ కంపెనీలకు, ఉద్యోగాలకు ఎస‌రు పెడుతున్నారని అన్నారు. ముఖ్యంగా చైనా లాంటి దేశాల నుంచి త‌మ దేశ ఉద్యోగాల‌ను తిరిగి తీసుకొస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అమెరికాలో నిర్మాణ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయంటూ ట్రంప్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌మ దేశం నుంచి విదేశాల‌కు కంపెనీల‌ను వెళ్ల‌నీయ‌కుండా ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులు అబద్ధాలు చెబుతున్నార‌ని, వాటిని విని ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగాలు, కంపెనీలు, ఇతర దేశాల‌కు వెళ్లిపోవ‌డంతో, చేప‌డుతోన్న చ‌ర్య‌ల‌తో అమెరిక‌న్లు విసిగిపోయార‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. పెన్సిల్వేనియాలో తానే గెలిచేందుకు అధిక అవ‌కాశాలున్నాయ‌ని, ఏదైనా మోసం జరిగితే తప్ప తాను ప‌రాజ‌యం పొందబోన‌ని అన్నారు. న‌వంబ‌రులో నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల్లో తాను గెలిచి అధ్య‌క్ష‌ప‌ద‌విని చేప‌డుతాన‌ని ఆయ‌న ఉద్ఘాటించారు.

More Telugu News