: కృష్ణా నీళ్లు బాగా లేవన్నది, బ్యాక్టీరియా ఉందనేది దుష్ప్రచారం మాత్రమే!: చంద్రబాబు

కృష్ణా నదిలో నీళ్లు బాగా లేవు, బ్యాక్టీరియా ఉందనేది దుష్ప్రచారమని, దీనిని ఖండించాలని అధికారులు, సిబ్బందికి సీఎం చంద్రబాబు సూచించారు. ఈ రోజు టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, స్వామీజీలు, పీఠాధిపతులు పుష్కర స్నానం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రభుత్వ సదుపాయాల వివరాల బోర్డులను అన్నిచోట్ల ఏర్పాటు చేయాలని, పుష్కర ఏర్పాట్లపై ప్రజల్లో వంద శాతం సంతృప్తి నెలకొనాలన్నారు. పుష్కరాల్లో బాగా పనిచేశామన్న పేరు అన్ని శాఖల వాళ్లు తెచ్చుకోవాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే వికలాంగులు, వృద్ధులకు హోంగార్డులు సాయపడాలని, గజ ఈతగాళ్లందరూ అప్రమత్తంగా ఉండాలని, వంతెనల వద్ద పోలీస్ పహారా ఉండాలని, పిండ ప్రదానం అధికంగా జరిగే ఘాట్ల వద్ద టెంట్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.

More Telugu News