: ఒబామాపై వచ్చిన కామెంట్లను సెన్సార్ చేసిన ‘ట్విట్టర్’

అమెరికా అధ్యక్షుడు ఒబామాపై నోరు పారేసుకుంటూ, ద్వేషిస్తూ వచ్చిన కామెంట్లను సెన్సార్ చేయాలని ట్విట్టర్ మాజీ సీఈవో డిక్ కస్టోలో సీక్రెట్ గా తన సిబ్బందిని గతంలో ఆదేశించారట. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ ‘బజ్ ఫీడ్’ వెల్లడించింది. గత ఏడాది మే నెలలో ఒబామా నిర్వహించిన ‘ఆస్క్ పోటస్’ టౌన్ హాల్ సమావేశం సందర్భంగా ఆయనను దూషిస్తూ ఈ వ్యాఖ్యలు వచ్చాయని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తామని ట్విట్టర్ చెప్పుకుంటున్నందునే ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచారని సమాచారం. కాగా, ఒబామా టౌన్ హాల్ సమావేశం జరిగిన నెల రోజుల తర్వాత ట్విట్టర్ సీఈవో పదవి నుంచి డిక్ కస్టోలో పక్కకు తప్పుకున్నారు. అంతకుముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్విట్టర్ భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. కామెంట్లపై నియంత్రణ విధించడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని డిక్ కస్టోలో వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News