: నికర లాభం 31 శాతం తగ్గింది: ఎస్బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇన్వెస్టర్లకు చేదు వార్తను చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నికర లాభం 31.7 శాతం తగ్గి రూ. 2,520 కోట్లకు చేరిందని, స్థూల నిరర్థక ఆస్తుల మొత్తం 6.94 శాతానికి చేరిందని పేర్కొంది. మార్కెట్ నిపుణుల అంచనాలకు మించి నెట్ ప్రాఫిట్, ఎన్పీఏ పెరగడం ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగించే అంశమేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బ్యాంకు రూ. 3,692 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, అది ఈ దఫా గణనీయంగా పడిపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తిరిగి రాని రుణాల వృద్ధి, తమ బ్యాంకులోనే తక్కువగా ఉందని ఈ సందర్భంగా ఎస్బీఐ పేర్కొనడం గమనార్హం. మొత్తం రూ. 6,340 కోట్ల బ్యాడ్స్ లోన్స్ ఉన్నాయని పేర్కొంది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 14,612 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.

More Telugu News