: మాధవరెడ్డి హత్య గురించి నయీమ్ కు తెలుసు, హెచ్చరించాడు కూడా: రిటైర్డ్ ఐపీఎస్ శ్రీరామ్ తివారి సంచలన వ్యాఖ్య

గ్యాంగ్ స్టర్ నయీమ్ 17 సంవత్సరాల క్రితం పోలీసు ఇన్ ఫార్మర్ గా తనకు తెలుసునని, అప్పట్లో ఎన్నో విషయాలు తనకు చెప్పాడని, ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సల్స్ హత్య చేసే ఆలోచనలో ఉన్నట్టు అతనికి తెలుసునని పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి శ్రీరామ్ తివారీ వెల్లడించారు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, వ్యాస్ హత్యానంతరం, కొంతకాలం జైలులో ఉన్న నయీమ్, ఆపై పోలీసులతో కలసి పనిచేశాడని, తాను కూడా రెండు మూడు సార్లు అతన్ని కలిసినట్టు పేర్కొన్నారు. నక్సల్స్ గురించి అతనిచ్చే సమాచారం పక్కాగా ఉండేదని తెలిపారు. 1997-2000 మధ్య ఎస్‌ఐబీ చీఫ్ గా తాను పనిచేస్తున్న వేళ, జైలులో ఉన్న నయీమ్ ఓ వీఐపీని పీపుల్స్ వార్ టార్గెట్ చేసిందని చెబితే, వాటిని తామే సరిగా డీకోడ్ చేయలేకపోయామని, చంద్రబాబుపై ఎటాక్ జరుగుతుందన్న ఆలోచనతో ఉండగా, ఎలిమినేటిపై దాడి జరిగిందని ఆనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అతను ఇంతపెద్ద గ్యాంగ్ స్టర్ గా మారి వేల కోట్లు కూడబెట్టాడని వింటుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

More Telugu News