: ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్ పై సీబీఐ చార్జిషీటు!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ పై సీబీఐ చార్జిషీటు దాఖలైంది. గతంలో కలకలం రేపిన ఆంట్రిక్స్- దేవాస్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ ఆయనపై నిన్న చార్జిషీటు దాఖలు చేసింది. ఇస్రో చైర్మన్ గా ఉన్న సమయంలోనే మాధవన్ నాయర్ ఆంట్రిక్స్ గవర్నింగ్ కౌన్సిల్ కు నేతృత్వం వహించారు. ఇలా రెండు పదవుల్లో ఉన్న ఆయన ఇస్రోకు సంబంధించిన కీలక కాంట్రాక్టును ఆంట్రిక్స్ కు చెందిన దేవాస్ కు కట్టబెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగగా, రంగంలోకి దిగిన సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం రూ.578 కోట్ల మేర అక్రమాలు జరిగాయని భావిస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే నాయర్ ను విచారించారు. తాజాగా ఆయనపై చార్జిషీటును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.

More Telugu News