: పాశర్లపూడి గ్యాస్ బావి నుంచి లీక్...అరికట్టేందుకు చర్యలు చేపట్టిన అధికారులు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి వద్ద ఆందోళన నెలకొంది. అక్కడి ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. దీనిని గుర్తించిన గ్రామస్థులు ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించండంతో రంగంలోకి దిగిన సిబ్బంది. గ్యాస్ లీక్ ను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించారు. కాగా, 1995లో పాశర్లపూడి ఓఎన్జీసీ గ్యాస్ బావిలో సంభవించిన లీకేజ్ కారణంగా చెలరేగిన మంటలు భారీ విధ్వంసం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ మంటలు అదుపు చేసేందుకు వారం రోజులు పట్టగా, విదేశాల నుంచి నిపుణులను కూడా తీసుకురావాల్సి వచ్చింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ఈ బావికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడు గ్రామాలను ఖాళీ చేయించాల్సి రాగా, 1500 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ మర్చిపోలేదన్న సంగతి తెలిసిందే.

More Telugu News