: ఉన్న‌త విద్యా మండ‌లి ఆస్తుల కేసులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిష‌న్‌ను తిరస్కరించిన సుప్రీం

ఉన్న‌త విద్యా మండ‌లి కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన స‌మీక్ష పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు ఈరోజు తిర‌స్క‌రించింది. సుప్రీంకోర్టు గ‌తంలో ఉన్న‌త విద్యామండ‌లి ఆస్తులు ఏపీ, తెలంగాణ‌ 58:42 నిష్ప‌త్తిలో పంచుకోవాల‌ని తీర్పు చెప్పిన సంగ‌తి తెలిసిందే. తీర్పును వెలువ‌రిస్తూ.. 10వ షెడ్యూల్‌లోని అన్ని అంశాల‌ను ఇదే విధంగా పంచుకోవాల‌ని ఆదేశించింది. రెండు నెలల్లో వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సూచించింది. అయితే, దీనిపై అభ్యంత‌రాలు తెలుపుతూ, ఆ తీర్పును స‌వాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో స‌మీక్ష పిటిష‌న్ వేసింది. పిటిష‌న్ ఈరోజు విచార‌ణ‌కు వ‌చ్చి తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌యింది.

More Telugu News