: 2,160 ఏళ్ల నాటి గ్రీస్ అథ్లెట్ లియోనిడాస్ సరసన నిలిచిన మైఖేల్ ఫెల్ఫ్స్

లియోనిడాస్ ఆఫ్ రోడెస్... గ్రీస్ చరిత్రకారుల ప్రకారం, ఒలింపిక్స్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పతకాలు సాధించిన ఆల్ టైం రియల్ అథ్లెట్. క్రీస్తు పుట్టక ముందు 164 నుంచి 152 సంవత్సరాల మధ్య పరుగుల వీరుడిగా ఉన్న లియోనిడాస్ ఖాతాలో మొత్తం 12 పతకాలు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఒలింపిక్స్ చరిత్రలో అతనిదే ఆల్ టైం ఇన్డివిడ్యువల్ మెడల్స్ రికార్డు. ఇప్పుడు దాన్ని సమం చేశాడు ఈత కొలును రారాజు మైఖేల్ ఫెల్ఫ్స్. ఇప్పటివరకూ 21 బంగారు పతకాలు సహా 25 పతకాలు సాధించిన ఫెల్ప్స్ ఖాతాలో 12 వ్యక్తిగత స్వర్ణాలు చేరాయి. బుధవారం జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో స్వర్ణం సాధించిన ఫెల్ఫ్స్, లియోనిడాస్ రికార్డును సమం చేయగా, ఈ ఒలింపిక్స్ లోనే ప్రపంచ చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా కూడా ఫెల్ఫ్స్ నిలువనున్నాడని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, దాదాపు 170 దేశాలు పాల్గొనే ఒలింపిక్స్ పోటీల ఆధునిక చరిత్రలో అమెరికాకు చెందిన కార్ల్ లూయిస్ అథ్లెటిక్స్ విభాగంలో, మార్క్ స్పిట్జ్ స్విమ్మింగ్ విభాగంలో, ఉక్రెయిన్ కు చెందిన జిమ్నాస్ట్ లారిసా లాత్నినా, ఫిన్ ల్యాండ్ కు చెందిన అథ్లెట్ పావో నుర్మీలు తొమ్మిదేసి పతకాలను సాధించారు.

More Telugu News