: ప్రధాని పిలుపుతో కదిలిన పంజాబ్ పోలీసులు... గో రక్షక్ రాష్ట్రాధ్యక్షుడిపై కేసు

గోవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ, దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిని ఊరికే వదలద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ గత రెండు మూడు రోజులుగా తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్న వేళ, పంజాబ్ పోలీసులు కదిలారు. ఓ ట్రక్కులో ఆవులను తీసుకు వెళుతున్న వారిపై నిర్దయగా దాడి చేశారన్న ఆరోపణలపై పంజాబ్ గో రక్షా దళ్ అధ్యక్షుడు సతీష్ కుమార్, మరో ఇద్దరు సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వారు దాడులు జరుపుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కొన్ని నెలలుగా, హల్ చల్ చేస్తుండగా, వాటిని సేకరించిన పోలీసులు తొలిసారి చర్యలకు దిగారు. "గో రక్షకుల్లో 70 నుంచి 80 శాతం మంది సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు., ఆవులను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ తమ పాపాలను కడిగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు" అని గత శనివారం నాడు మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఆపై నిన్నటి హైదరాబాద్ మహా సమ్మేళనంలో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నకిలీ గో సంరక్షకులను అణచివేయాల్సి వుందని మోదీ చేసిన వ్యాఖ్యల తరువాత, తొలి కేసు నమోదు కావడం గమనార్హం.

More Telugu News