: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌కూ సొంత విమానాలు... సరుకు రవాణాను విస్తృతం చేయడమే లక్ష్యం

సరుకు రవాణా వ్యవస్థను మరింత విస్తృతం చేయాలని భావిస్తున్న ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సొంత కార్గో విమానాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం 40కి పైగా విమానాల ద్వారా సరుకులను రవాణా చేస్తున్న అమెజాన్ ఇక నుంచి సొంత కార్గో విమానం ‘ప్రైమ్ ఎయిర్’ ద్వారా సరుకులను డెలివరీ చేయనుంది. 2013లో క్రిస్మస్ సందర్భంగా సరుకు డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంస్థ దీనిని అధిగమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే అట్లాస్ ఎయిర్‌కు చెందిన 40 బోయింగ్ విమానాలను అద్దెకు తీసుకుంది. అయితే అద్దె విమానాలను ఎంతకాలం ఉపయోగించుకుంటామని భావించిన అమెజాన్ సొంతంగానే విమానాలు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఓ కార్గో విమానాన్ని సొంతం చేసుకుంది. ఇక నుంచి సొంత విమానం ‘ప్రైమ్ ఎయిర్’ ద్వారానే సరుకులు రవాణా చేయనుందన్న మాట.

More Telugu News