: అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి ఎన్నికైన మొదటి మహిళ నీతా అంబాని

అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఎన్నికయ్యారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా నీతా అంబానీ రికార్డు సృష్టించారు. నీతాను జూన్ నెలలో ఐఓసీ సభ్యురాలిగా ఎగ్జిక్యూటివ్ బోర్డు నామినేట్ చేసింది. ఈరోజు జరిగిన వరల్డ్ బాడీ 129వ సమావేశంలో ఐఓసీ సభ్యురాలిగా నీతా ఎన్నికయ్యారు. ఒలింపిక్ అజెండా 2020 సిఫారసుల ఆధారంగా ఐఓసీ సభ్యుల నియామకం జరిగింది. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, ఐఓసీ సభ్యురాలిగా ఎన్నిక కావడం తనకెంతో గర్వకారణంగా, సంతోషంగా ఉందని చెప్పారు. ఐఓసీ సభ్యురాలిగా తనను ఎంపిక చేయడం ద్వారా ప్రపంచంలో భారత్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, భారత మహిళకు ఉన్న గుర్తింపు అర్థమవుతోందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఒలింపిక్స్, ఆటలకు ప్రాధాన్యత గురించి దేశ వ్యాప్తంగా తెలియజెప్పేందుకు తన వంతు కృషి చేస్తానని, యువతను తీర్చిదిద్దే శక్తి క్రీడల్లో ఉందనే విషయాన్ని తాను నమ్ముతానని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు.

More Telugu News