: రైల్వే మంత్రి తెలంగాణ పర్యటన...పాత ఫైళ్ల బూజు దులపాలని ఆదేశాలు

రైల్వే మంత్రి సురేష్ ప్రభు విభిన్నమైన పనితీరుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేంద్ర కేబినెట్ లో సురేష్ ప్రభు పని తీరు తరువాతే ఎవరైనా అన్న రీతిలో ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా, మిషన్ భగీరధ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఆహ్వానించారు. నవంబర్ 8న ఆయన నేషనల్ మజ్దూర్ యూనియన్ కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీనికి హాజరయ్యేందుకు ఆయన సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిలవడంతో ఆయన తెలంగాణ పర్యటనకు ఒక రోజు ముందుగానే హైదరాబాదు చేరుకోనున్నారు. దీంతో రైల్వే శాఖాధికారులకు తెలంగాణలో అమలు కాకుండా ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు కావాలని, తాను రానున్న ఆగస్టు 7వ తేదీ నాటికి ప్రణాళికలు, అమలుకు కావాల్సిన ప్రాధమిక కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు పాతఫైళ్ల బూజుదులిపి, దేనిని పట్టాలెక్కించాలా? అని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ప్రారంభోత్సవాల్లో సికింద్రాబాద్-సిద్దిపేట-కరీంనగర్ రైల్వేలైను శంకుస్థాపన కూడా ఉండడంతో దానితోనే సరిపెట్టే అవకాశం ఉందా? ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రకటించనున్నారా? అన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

More Telugu News