: పాక్ లో క్రికెట్ శకం ముగిసినట్టే: సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్

ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయిలో ఒకనాడు వెలిగిన పాకిస్థాన్ క్రికెట్ శకం, ఇక ముగిసినట్టేనని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ లో ఆడేందుకు ఏ దేశమూ ససేమిరా అంటున్న వేళ, స్వదేశంలో నిర్వహించాలని భావించిన సిరీస్ లను యూఏఈకి తరలించాలని పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని యూసఫ్ తప్పుబట్టాడు. ఎన్నో ఏళ్లుగా ఒక్క మ్యాచ్ కూడా జరగని అరబ్ పిచ్ లు ఇప్పుడు నిర్జీవంగా ఉన్నాయని, షార్జా, అబూదాబీ స్టేడియాల్లో ఆడి పాక్ క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని కోల్పోయారని అన్నాడు. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 9 సెంచరీలు చేసిన ఆటగాళ్లు, తాజా ఇంగ్లండ్ టూర్ లో ఒక్క సెంచరీకే పరిమితమై, తమ అద్వాన ఆటతీరును బయటపెట్టారని అన్నాడు. యూఏఈ బదులు శ్రీలంక, బంగ్లాదేశ్ పిచ్ లను ఎంచుకోవాలని, లేకుంటే ప్రస్తుతం వెస్టిండీస్ ఎదుర్కుంటున్న పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించాడు.

More Telugu News