: ఎఫ్ 35-ఏ రెడీ: యూఎస్ ఎయిర్ ఫోర్స్

అత్యధిక బరువును మోసుకుంటూ, అతివేగంగా ప్రయాణిస్తూ, బాంబుల వర్షం కురిపించగల సరికొత్త ఎఫ్-35ఏ స్టెల్త్ యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయని, భవిష్యత్ యుద్ధ విమానాల అవసరాలు తీర్చే దిశగా ఇదో మైలురాయని యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. మొత్తం 12 ఎఫ్-35ఏ విమానాల స్క్వాడ్రన్ సిద్ధమైందని, ఇవన్నీ హిల్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్, వీటి యుద్ధ నైపుణ్య రేటింగ్ పై పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. యుద్ధ క్షేత్రాల్లో కమాండర్లు, ఇప్పుడున్న యుద్ధ విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లడం వీటి ప్రత్యేకతగా చెప్పిన యూఎస్ ఎయిర్ కాంబాట్ కమాండ్ చీఫ్ జనరల్ హెర్బర్ట్ కార్లైసిల్, వీటిని ఎప్పుడు వాడతారన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. కాగా, వీటిని 2017 ప్రారంభంలో వినియోగించవచ్చని తెలుస్తోంది. అమెరికా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ గా 400 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 27 లక్షల కోట్లు) కేటాయించి మొత్తం 2,442 ఎఫ్-35 విమానాల తయారీని ప్రకటించగా, వీటిని రూపొందించే కాంట్రాక్టును లాక్ హీడ్ మార్టిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. శబ్ద వేగానికి మించిన స్పీడుతో, రాడార్ల నుంచి తప్పించుకుంటూ ఈ విమానాలు ప్రయాణిస్తాయి. 2014లో ఓ ఎఫ్-35ఏ విమానం ఇంజన్ లో మంటలు చెలరేగడంతో, అప్పటి నుంచి సమస్యను పరిష్కరించే వరకూ తయారైన విమానాలను పక్కన పెట్టాలన్న నిర్ణయం వివాదాస్పదమైంది. సమస్య ఏర్పడితే విమానంలోని పైలట్ ప్రాణాలను కాపాడే, పైలట్ ఎజెక్టింగ్ సిస్టమ్ లోనూ లోపాలు కనిపించాయి. 62 కిలోల కన్నా అధిక బరువున్న పైలట్లను ఇవి కాపాడలేవని తేల్చడంతో సైన్యంలోకి వీటి చేరిక మరింత ఆలస్యమైంది.

More Telugu News