: భారీ వరద వల్లే బ్రిడ్జి కూలింది, అది పురాతనకాలం నాటిది: మహారాష్ట్ర సీఎం

మ‌హారాష్ట్ర‌లో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న వ‌ర్షాల‌తో మహద్‌లోని ముంబయి-గోవా రహదారిపై సావిత్రి న‌దిపై ఉన్న బ్రిడ్జి కూలిన ప్రమాదం గురించి ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ స్పందించారు. భారీ వ‌ర‌ద ధాటికే ఆ బ్రిడ్జి కూలిపోయింద‌ని ఆయన పేర్కొన్నారు. ఆ బ్రిడ్జి పురాతనకాలం నాటిదని ఆయ‌న అన్నారు. ప్ర‌మాదంలో మొత్తం 20 మంది గ‌ల్లంత‌య్యార‌ని, రెండు బస్సులు, రెండు కార్లు కొట్టుకుపోయాయ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌మాదంలో గ‌ల్లంత‌యిన వారి కోసం కోస్టుగార్డ్ హెలికాప్టర్, ఎన్డీఆర్‌ఎఫ్ టీంలు ముమ్మ‌రంగా గాలిస్తున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌ధాని మోదీ త‌మ‌కు ఫోన్ చేసి ప్ర‌మాదం గురించి ఆరా తీశార‌ని, కేంద్రం సాయాన్ని అందిస్తుంద‌ని పేర్కొన్నార‌ని తెలిపారు.

More Telugu News