: చైనా ప్రాజెక్టుపై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిరసనలు.. ఓ కన్నేసిన భారత్

చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గిల్గిత్-బాల్టిస్థాన్, పీవోకే ప్రజలు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో పాటు నిరసనలకు దిగుతుండడంతో ప్రాజెక్టు కాస్తా వివాదాస్పదమైంది. 46 బిలియన్ డాలర్ల వ్యయంతో అతిపెద్ద ఎకనమిక్ కారిడార్ నిర్మించాలని చైనా భావిస్తోంది. దక్షిణ పాకిస్థాన్‌ను కలుపుతూ 3వేల కిలోమీటర్ల పొడవునా రోడ్లు, రైలు మార్గాలు, పైపు లైన్లు నిర్మించాలని చైనా నిర్ణయించింది. అయితే, తమ భూభాగం నుంచి ఈ కారిడార్ నిర్మాణానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని గిల్గిత్-బాల్టిస్థాన్, పీవోకే ప్రజలు భీష్మించుకున్నారు. మరోవైపు చైనా నిర్మించ తలపెట్టిన ఎకానమిక్ కారిడార్‌పై భారత్ దృష్టి సారించింది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ అంశాన్ని అతి దగ్గరి నుంచి పరిశీలిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. పాక్ తన అక్రమ ఆక్రమణను ఇలాంటి కుయుక్తులతో చట్టబద్ధం చేసుకోవాలని భావిస్తోందని అన్నారు. అయితే పాక్ ఆశలు ఎప్పటికీ నెరవేరబోవని ఆయన పేర్కొన్నారు.

More Telugu News