: అక్రమ రవాణాకు పరాకాష్ట... హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న 12 మంది పీఐ ఎయిర్ లైన్స్ సిబ్బంది అరెస్ట్

బంగారం, డ్రగ్స్ వంటి వాటిని ఒక దేశం నుంచి మరో దేశానికి అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయిన వారు ఎందరో ఉన్నారు. కొన్నిసార్లు విమాన సిబ్బందే పట్టుబడ్డారు కూడా. కానీ, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానం సిబ్బంది మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఏకంగా రూ. 6 కోట్ల విలువైన హెరాయిన్ ను విమానం టాయ్ లెట్లో దాచి దుబాయ్ చేర్చాలని చూశారు. లాహోర్ నుంచి దుబాయ్ వెళుతున్న విమానంలో సిబ్బందే స్వయంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో, యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపి 6 కిలోల హెరాయిన్ ను పట్టుకున్నారు. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పీఐ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి డానియల్ గిలానీ ధ్రువీకరించారు. వీరందరిపైనా విచారణ జరుగుతోందని, దోషులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

More Telugu News