: ప్రపంచంలో నేడు ప్రతి 84 గంటలకు ఒక మారణహోమం!

జర్మనీ రాజధాని మ్యూనిచ్‌, బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌, నీస్‌, టర్కీలోని ఇస్తాంబుల్, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, అమెరికాలోని శాన్ బెర్నాండో, ఇండోనేషియాలోని జకార్తా, ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్... ఇలా ప్రపంచంలోని ప్రతి చోటా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు దారుణ మారణహోమానికి తెగబడుతున్నారు. గత 53 రోజులుగా ప్రతి 84 గంటలకోసారి ఉగ్రవాదులు ప్రపంచంలోని ఏదో ఒకచోట పంజా విసురుతూనే ఉన్నారు. అమెరికా ది గ్రూప్‌ ఇంటెల్‌ సర్వీస్‌ లెక్కల ప్రకారం ప్రతి 84 గంటలకోసారి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అమాయకులను బలిగొంటున్నారు. జూన్‌ 8 నుంచి ఐసిస్‌ సంబంధిత లేదా ప్రేరేపిత దాడి ప్రతి 84 గంటలకొకటి చొప్పున చోటుచేసుకుంటోంది. సిరియా, ఇరాక్ లలో నిత్యం రక్తపాతం జరగాల్సిందే. ఆ తరువాత ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి మరింత ఘోరం ఇక్కడ ఐఎస్ఐఎస్ తో పాటు లష్కరేతోయిబా కూడా పంజా విప్పుతోంది. ఈజిప్టు, లిబియాల్లో కూడా ఐఎస్ఐఎస్ విద్వేషం చిమ్ముతోంది. సాధారణంగా ఉగ్రదాడులు పెద్ద పట్టణాల్లోనే చోటుచేసుకునేవి. ఈ జాబితాలో రాజధాని, లేదా ప్రధాన పట్టణాల్లోని రద్దీ ప్రాంతాల్లో మాత్రమే ఆత్మాహుతి దాడులు చోటుచేసుకునేవి. ఐఎస్ఐఎస్ రంగప్రవేశంతో దాడుల వ్యూహం మారింది. పట్టణాలలో జనం గుమిగూడితే చాలు, వారిని చంపేయాల్సిందే అన్నది వారి లక్ష్యం అయింది. సాంకేతికత కూడా పెద్దగా ఉపయోగించకుండా వీరు దాడులకు పాల్పడడం అందర్నీ ఆందోళనలోకి నెడుతోంది.

More Telugu News