: టర్కీలో మరోసారి ఆందోళనలు.. 35 మంది మిలిటెంట్ల హతం

ఇటీవ‌లే ట‌ర్కీలో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరగడం, పర్యవసానంగా ఆ దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించాల్సిన పరిస్థితి రావడం మనకు తెలిసిందే. ఆ ప‌రిస్థితులు ఇంకా చ‌ల్ల‌బ‌డ‌క‌ముందే తాజాగా మ‌రోసారి జ‌రిగిన ఆందోళ‌న‌ల‌తో ట‌ర్కీ ప్ర‌జ‌లు ఉలిక్కిప‌డ్డారు. కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన మిలిటెంట్లు అల‌జ‌డి సృష్టించారు. హక్కారీ ప్రావిన్స్‌లోని ఓ ఆర్మీ బేస్‌ను ముట్ట‌డించేందుకు వారు విఫ‌ల‌య‌త్నం చేశారు. మిలిటెంట్లను గ‌మ‌నించిన అధికారులు వారి ముట్ట‌డిని అరిక‌ట్టేందుకు కాల్పులు జ‌రిపారు. దీంతో 35 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. నిన్న కూడా ట‌ర్కీలో ఇటువంటి క‌ల‌క‌లమే చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. హక్కారీ ప్రావిన్స్‌లో నిన్న‌ కుర్దిష్‌ మిలిటెంట్లు, ట‌ర్కీ ఆర్మీ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

More Telugu News