: టెస్టును రసకందాయంలో పడేసిన శ్రీలంక బౌలర్లు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తమ టెస్టును శ్రీలంక జట్టు రసకందాయంలో పడేసింది. పల్లెకిలలో ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగింది. 117 పరుగులకే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో బౌలర్లు కుప్పకూల్చగా, ఆ తర్వాత ఆసీస్ బ్యాట్స్ మన్ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించి 203 పరుగులు చేశారు. దీంతో, తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 86 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తర్వాత మూడో రోజు ఆటలో పుంజుకున్న శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేసింది. కుశాల మెండీస్ (176 పరుగులతో) విశేషంగా రాణించాడు. అతనికి చండిమాల్ (42), డిసిల్వా (36), పెరీరా (36) చక్కని సహకారమందించారు. దీంతో శ్రీలంక జట్టు 268 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (26), వోజెస్ (9) వున్నారు. ఈ క్రమంలో విజయానికి ఆస్ట్రేలియా జట్టు 185 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ టర్న్ తీసుకుంటుండడంతో శ్రీలంక స్పిన్నర్లు దూకుడుగా బంతులు వేస్తున్నారు. ఒక రోజు ఆట మిగిలి ఉండగా, ఏడు వికెట్లు తీస్తే లంక ఆధిక్యంలోకి వెళ్తుంది, 185 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది. చిరుజల్లులు కురుస్తుండడంతో శ్రీలంక వైపు విజయం మొగ్గే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News