: విలువలు కలిగిన వ్యక్తి కథే 'జక్కన్న': సునీల్

'జక్కన్న' సినిమా విలువలు కలిగిన వ్యక్తి కథ అని నటుడు సునీల్ తెలిపాడు. 'జక్కన్న' సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, పర్ఫెక్షన్ కోరుకునే గణేష్ అనే వ్యక్తి పాత్రను 'జక్కన్న' సినిమాలో పోషించానని చెప్పాడు. ఎవరైనా సాయం చేస్తే...వారికి జీవితాంతం సాయం చేసే వ్యక్తిగా కనిపిస్తానని సునీల్ చెప్పాడు. సినిమా కోసం అందరం కష్టపడి పని చేశామని, ఈ సినిమాలో అన్ని రసాలు ఉంటాయని సునీల్ తెలిపాడు. ప్రేక్షకులు, అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తారో అవన్నీ ఇందులో ఉంటాయని, వాటితోపాటు మంచి కథ, కథనం కూడా ఉంటాయని సునీల్ తెలిపాడు. ఈ సినిమాతో తనపై ఉన్న అంచనాలను అందుకుంటానని సునీల్ చెప్పాడు. సినిమాలోని ఇతర పాత్రలకు 'జక్కన్న' ఏం చేస్తున్నాడో తెలియదని, అయితే 'జక్కన్న' మాత్రం అన్నీ క్లారిటీతో చేస్తుంటాడని సునీల్ తెలిపాడు. ఈ కథనమే తనను ఆకట్టుకుందని అన్నాడు.

More Telugu News