: ప్రపంచపు అతిపెద్ద ఉభయచర లోహ విహంగాన్ని ఆవిష్కరించిన చైనా

భారీ విమానాల తయారీలో చైనా మరో ముందడుగు వేసింది. అడవుల్లో నిప్పు రగులుకున్న వేళ, సులువుగా దాన్ని ఆర్పేలా బోయింగ్ 737 పరిమాణంలో ఉండేంతటి అతిపెద్ద లోహ విహంగాన్ని తయారు చేసింది. అటు విమానాశ్రయాల రన్ వేపై, ఇటు నదులు, సముద్రాలపై సులువుగా ల్యాండ్ అయి, టేకాఫ్ తీసుకోగలిగే విమానాన్ని తయారు చేసింది. 53.5 టన్నుల బరువును మోస్తూ గాల్లోకి లేచే విమానం, నీటిపై ల్యాండయిన వేళ, 20 సెకన్ల వ్యవధిలో 12 టన్నుల నీటిని తనలోకి తీసుకుని తిరిగి పైకి ఎగురుతుంది. ఝహాయ్ సిటీలోని ఫ్యాక్టరీలో ఏజీ 600 పేరిట ఇది తయారైంది. నాలుగు ఇంజన్లతో ఉంటుంది. విమాన అవసరాలు తీర్చుకునేందుకు ఎయిర్ బస్, బోయింగ్ వంటి కంపెనీలపై ఆదారపడి ఉండరాదన్న చైనా ప్రభుత్వ సర్కారు ఈ విమానం రూపకల్పనకు దారితీసింది. దక్షిణ చైనా సముద్రంలో పలు దేశాలతో వివాదాలు కొనసాగుతున్న తరుణాన ఈ విమానం తమకెంతో ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది.

More Telugu News