: జావెలిన్ త్రోలో నీరజ్ ప్రపంచ రికార్డు... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు

ఢిల్లీలో జరుగుతున్న అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ పోటీల్లో సంచలనం నమోదైంది. హరియాణాకు చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలవడంతో పాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 18 సంవత్సరాల నీరజ్ గత రికార్డుగా ఉన్న 79.66 మీటర్లను తన రెండో ప్రయత్నంలో అధిగమించి 86.48 మీటర్ల దూరానికి జావెలిన్ విసిరి ఈ రికార్డును ఒడిసి పట్టుకున్నాడు. దీంతో లాత్వియాకు చెందిన జిగిస్మండ్స్ 2011లో నెలకొల్పిన రికార్డు మాయమైంది. 14 సంవత్సరాల వయసులోనే 68 మీటర్లకు పైగా జావెలిన్ ను విసిరిన నీరజ్, ఇటీవల ఒలింపిక్స్ కు జరిగిన అర్హత టోర్నీలో తృటిలో అవకాశాన్ని కోల్పోయాడు. ఆ పోటీలో 79.73 మీటర్లకే పరిమితమైన నీరజ్, ఇప్పుడు మరో ఆరు మీటర్ల దూరాన్ని సాధించాడు. ఇప్పుడు నీరజ్ ను మరింతగా సానపడితే, చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శనను రాబట్టవచ్చని భారత జావెలిన్ త్రో కోచ్ గారీ కాల్వెట్ వ్యాఖ్యానించాడు. అథ్లెటిక్స్ లో ఇండియన్ ఆటగాడు వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడం ఇదే ప్రథమం.

More Telugu News