: రెండో రోజూ కోహ్లీ సేనదే పైచేయి!... 566 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా!

కరిబీయన్ గడ్డపై ‘హ్యాట్రిక్ సిరీస్’పై కన్నేసిన కోహ్లీ సేన దానిని సాధించే దిశగానే సాగుతోంది. వెస్టిండిస్ తో మొదలైన తొలి టెస్టులో తొలి రోజు సత్తా చాటిన టీమిండియా... నిన్న రెండో రోజు కూడా బ్యాటింగ్ లో సత్తా చాటింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు. సరిగ్గా 200 పరుగులు చేసిన కోహ్లీ... గాబ్రియెల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపు బ్యాటింగ్ ను కొనసాగించిన టీమిండియా స్కోరు 566 పరుగులకు చేరగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి టీమిండియా 566 పరుగులు చేసినట్లైంది. ఆ తర్వాత వెనువెంటనే తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్టిండిస్ కు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. 14 ఓవర్లలోనే ఓ వికెట్ ను తీసిన టీమిండియా బౌలర్లు... విండీస్ స్కోరును 31 పరుగులకే కట్టడి చేసింది. వెరసి తొలి రోజు మాదిరే రెండో రోజు కూడా అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ తోనూ టీమిండియా సత్తా చాటింది.

More Telugu News