: ఐదేళ్ల క్రితం ఇదే గడ్డపై అరంగేట్రం చేశా...మళ్లీ కెప్టెన్ గా అడుగు పెట్టా: కోహ్లీ

టీమిండియా తరపున ఆటగాడిగా 2011లో ఇదే గడ్డపై టెస్టు క్రికెట్ లో అరంగేట్రం చేశానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆంటిగ్వాలో నేడు వెస్టిండీస్ తో తొలిటెస్టు ఆడనున్న నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ, ఐదేళ్ల తరువాత కెప్టెన్ గా అదే గడ్డపై ఆడడానికి రావడాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. టెస్టు క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్న దగ్గరే కెప్టెన్ గా ఆడడం ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలి? పరిస్థితులకు తగ్గట్టు ఆటగాడు తనను తాను ఎలా మలచుకోవాలి? వంటి విషయాలను ఇక్కడే నేర్చుకున్నానని చెప్పాడు. టెస్టు క్రికెట్ పై అవగాహన వచ్చింది ఇక్కడ ఆడడం వల్లేనని కోహ్లీ తెలిపాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై ఉపయోగించిన ఐదు బౌలర్ల వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటున్నానని, అయితే జట్టులో ఎవరిని ఎంచుకోవాలన్నది సవాల్ గా మారిందని చెప్పాడు. ఐదుగురు బౌలర్లను ఎంచుకుంటే టీమిండియా ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ లో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తోందని చెప్పాడు.

More Telugu News