: అమెరికాపై ఆగ్రహాన్ని కేఎఫ్సీ, యాపిల్ లపై తీర్చుకుంటున్న చైనీయులు!

అమెరికాపై తమకున్న కోపాన్ని చైనా వాసులు వినూత్నంగా తీర్చుకుంటున్నారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న వివాదాల్లో యూఎస్ జోక్యాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతున్న వేళ, తామేమీ తక్కువ కాదని ప్రజలు సైతం వీధుల్లోకి వచ్చి విధ్వంసాలకు దిగుతున్నారు. అది కూడా అమెరికన్ సంస్థలపై! చైనాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కేఎఫ్సీ రెస్టారెంట్లపై దాడులు జరుగుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయగా, దేశభక్తిని తెలిపే పద్ధతి ఇది కాదని చెబుతూ, ఒక్కొక్కరికి 15 రోజుల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఇక మరికొందరు చైనాకు అనుకూల నినాదాలు చేస్తూ, యాపిల్ సంస్థ ప్రొడక్టులైన ఐఫోన్లను కిందపడేసి బద్ధలు కొడుతుండగా తీసిన వీడియో వైరల్ అయింది.

More Telugu News