: మమ్ముట్టి సినిమాలో డైలాగులపై మహిళా కమిషన్ నోటీసులు

మలయాళంలో అగ్రనటుడైన మమ్ముట్టికి కేరళ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మల్లూవుడ్ ప్రేక్షకులకు రంజాన్ కానుకగా విడుదల చేసిన 'కసాబా' సినిమాలో డ్యూటీలో ఉన్న మహిళా అధికారిని హెచ్చరించే క్రమంలో మమ్ముట్టి పలికే డైలాగులు మహిళలను కించపరిచేలా ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఆయనతో పాటు ఈ సినిమా నిర్మాత, దర్శకుడికి కూడా నోటీసులు జారీ చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో మమ్ముట్టి లాంటి అగ్రహీరోల సినిమాల్లో ఇలాంటి సంభాషణలు ఉండడం శోచనీయమని చెప్పిన కేరళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రోసకుట్టి టీచర్, అగ్రనటులు ఇలాంటి డైలాగులు పలకకూడదని, అలాంటి సన్నివేశాల్లో నటించకుండా ఉంటే బాగుంటుందని సూచించారు. సినిమాల్లో మహిళలను కించపరిచే డైలాగులు, సన్నివేశాలు లేకుండా చూడాలని సెన్సార్ బోర్డు, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులకు లేఖలు రాయాలని ఆమె నిర్ణయించారు.

More Telugu News