: పనితీరు దిగజారింది... చాలా నిరుత్సాహంగా ఉన్నా!: 2 లక్షల మందికి రాసిన లేఖలో ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా

భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ-1 ఆర్థిక ఫలితాలు అటు ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఈవో విశాల్ సిక్కా 1.97 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశించి రాసిన ఈ-మెయిల్ లేఖలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరు దిగజారిందని, ఆ ప్రభావం ఫలితాలపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనకు ఎంతో నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నారు. మూడు నెలల కాలం సంస్థ పనితీరును బేరీజు వేసేందుకు సరిపోతుందని అభిప్రాయపడ్డ ఆయన, నైపుణ్యానికి తగ్గట్టుగా ఉద్యోగులు కష్టపడలేదని అన్నారు. సంస్థాగతంగా అందరమూ చేస్తున్న కృషికి తగిన ఫలితాలు రాలేదని, ఆదాయ వృద్ధి కేవలం 2.2 శాతం మాత్రమే నమోదైందని గుర్తు చేశారు. క్లయింట్లతో కుదుర్చుకున్న ప్యాకేజీల అమలు విధానంలో లోపాలకు తోడు, దేశంలో వ్యాపార మందగమనం ఈ పరిస్థితికి కారణమని అన్నారు. ఇన్ఫోసిస్ చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఎస్.రవికుమార్ నాయకత్వ లక్షణాలు సంస్థకు మేలు కలిగించాయని, టీం లీడర్ సందీప్ సైతం చక్కగా కృషి చేశాడని వ్యాఖ్యానించారు. ఇటీవలే విడుదల చేసిన సాఫ్ట్‌ వేర్‌ తోపాటు స్కావా, ఎడ్జ్, డిజైనింగ్ సర్వీసులు భవిష్యత్ ఆదాయ వృద్ధికి కీలకమని, సమీప భవిష్యత్తులో ఉద్యోగులు తమ పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుని బలహీనంగా ఉన్న మొదటి త్రైమాసిక ఫలితాలను అధిగమించాలని ఆయన కోరారు.

More Telugu News