: క్రీడా కలకలం... రష్యా వెళ్లి 'డోపీ' తండ్రి వద్ద శిక్షణ తీసుకున్న సీమా పునియా!

రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున డిస్కస్ త్రో విభాగంలో పోటీ పడనున్న సీమా పునియా, డ్రగ్స్, డోపింగ్ కేంద్రంగా ఉన్న రష్యాకు వెళ్లడం, డోపీగా పట్టుబడిన మరో క్రీడాకారిణి తండ్రి వద్ద శిక్షణ తీసుకోవడం వివాదాస్పదమైంది. తన భర్త, కోచ్ అంకుశ్ లతో కలసి రష్యా వెళ్లిన ఆమె, అక్కడి నుంచే రియోకు వెళ్లనుండగా, ఆమె వైఖరిపై ఏఎఫ్ఐ (భారత అథ్లెటిక్స్ సమాఖ్య) తీవ్రంగా ఆక్షేపిస్తోంది. అయితే, తాను ముందుగానే భారత క్రీడాప్రాధికార సంస్థ, డోపింగ్ నిరోధక సంస్థలకు సమాచారం ఇచ్చి రష్యాకు వెళ్లానని సీమా వెల్లడిస్తుండగా, తాము అనుమతి మాత్రం ఇవ్వలేదని అధికారులు అంటున్నారు. పెను డోపింగ్ అరోపణలతో అట్టుడుకుతున్న రష్యాకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తోంది. కాగా, లండన్ ఒలింపిక్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన డార్యా పిశ్చాల్నికోవ్, ఆపై డోపింగ్ లో పట్టుబడగా, ఆమె తండ్రి విటాలి వద్దకు సీమా వెళ్లడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. అయితే, తానేమీ విటాలీ వద్దకు శిక్షణకై వెళ్లలేదని, కేవలం వసతి ఏర్పాట్లు మాత్రమే చేశాడని సీమా అంటుండటం గమనార్హం.

More Telugu News