: దక్షిణ చైనా సముద్రం విషయంలో మెట్టు దిగి చర్చలకు సిద్ధమన్న చైనా... ససేమిరా కుదరదన్న ఫిలిప్పీన్స్

హేగ్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పును అంగీకరించే సమస్యే లేదని నిన్నటివరకూ భీష్మించుకుని కూర్చున్న చైనా ఓ మెట్టు దిగింది. ఫిలిప్పీన్స్ తో చర్చలకు సిద్ధమన్న సంకేతాలను పంపింది. కొన్ని నిబంధనలకు లోబడి ఉన్నత స్థాయి చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి రావాల్సిందిగా కోరింది. చైనా నుంచి చర్చలకు ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమేనని, తాము మాత్రం వాటిని తిరస్కరించామని ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి పర్ ఫెక్టో యాసయ్ తెలిపారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన, ట్రైబ్యునల్ తీర్పే తమకు ఫైనల్ అని స్పష్టంగా చైనాతో చెప్పేశామని ఇక తీర్పుపై చర్చలకు అవకాశాలే లేవని, చైనా వెనక్కు తగ్గి, తమ హక్కులు తమకు ఇవ్వాలని ఆయన అన్నారు.

More Telugu News