: 20 ఏళ్ల తరువాత ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్పిన్నర్ గా పాక్ ఆటగాడు

ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ జట్టుపై గెలిచిన పాకిస్థాన్ ఆటగాళ్లు ఆ ఆనందంలో ఉండగానే ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ వారిని మరింత ఆనందంలో ముంచెత్తాయి. కారణం తొలి టెస్టులో పది వికెట్లు సాధించిన పాక్ స్పిన్నర్ అంతర్జాతీయ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో పాక్ స్పిన్నర్ యాసిర్ షా 75 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో 69 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో తొలి టెస్టులో పది వికెట్లు తీశాడు. అరుదైన ఫీట్ సాధించే క్రమంలో తాజా ఐసీసీ ర్యాంకిగ్స్‌ లో ఫస్ట్ ప్లేస్ సాధించాడు. 1996లో పాక్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ టెస్ట్ ర్యాంకింగ్స్‌ లో టాప్ బౌలర్ గా నిలబడగా ఆ తరువాత ఎవరూ అగ్రస్థానానికి చేరుకోలేదు. సుదీర్ఘ విరామం అంటే 20 ఏళ్ల తరువాత యాసిర్ షా నెంబర్ వన్ టెస్టు బౌలర్ గా నిలవడం ఆ జట్టులో మరింత ఆనందం నింపింది.

More Telugu News